Online ద్వారా డబ్బు సంపాదించడం అనేది నిజామా కాదా?
చాలామంది Online ద్వారా డబ్బు సంపాదించటం అనేది చాల చాల అసత్యం అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అసలు ఆన్లైన్ ద్వార డబ్బు ఎలా వస్తుంది అని, ఎవరు ఇస్తారు అని ఇది అంత ఫేక్ అని అంటుంటారు. ఇది ఒకరకంగా 99% నిజం. ఎందుకు అంటే చాలామంది నిరుద్యోగులు ఏదో రకంగా నిజాయితీగా డబ్బు సంపాదించాలని చాల రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు, దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది online ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని చెబుతుంటారు. ఎలా అంటే మీరు డేటా ఎంట్రీ వర్క్ తీసుకోండి అందులో 250 పేజెస్ ఉంటాయి ప్రతి ఒక్క పేజికి 100 రూపాయలు ఇస్తాము దీనికి గాను 6000 రూపాయలు డబ్బు కట్టాలి అని చెబుతుంటారు. అంతే కాకుండా Ads చూస్తే లేదా క్లిక్ చేస్తే డబ్బు వస్తుంది అని చెబుతుంటారు. దీనిని అందరూ నమ్మి చేయాలనుకుంటారు. అయితే ఇందులో ఎటువంటి సత్యం లేదు మొత్తం ఫేక్. ఈరకంగా Online ద్వారా దాదాపు పలు రకాలుగా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో నేను ఒకడిని.
కాని పైన చెప్పిన విదంగా 1% మాత్రమే online ద్వారా డబ్బు సంపాదించటం అనేది సత్యం. అది ఏంటి అనేది నేను మీకు వివరంగా చెబుతాను కొంచెం ఓపికతో వినండి. ఆ తరువాత నిర్ణయం మీదే.
ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే నేను గత One Year నుండి Online ద్వారా డబ్బు సంపాదించాలని చాల ప్రయత్నం చెసాను. ఇప్పటికి నా కల నెరవేరింది. నేను ఏ రకంగా ప్రయత్నం చేశాను అంటే?
నేను మొట్ట మొదట Youtube ద్వారా డబ్బుసంపాదించడం మొదలు పెట్టాను. తరువాత Blogger ద్వార కూడా earning చేయడం మొదలు పెట్టాను.
యుట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?
- నేను Last Year 2015 లో Youtube Channel ని Create చేసాను. నేను ఈ Youtube ఛానల్ లో Computer ఎడ్యుకేషన్ కి సంబందిచిన వీడియోస్ ను తెలుగు లో రికార్డ్ చేసి upload చేసాను.
- అప్లోడ్ చేసిన వీడియోస్ ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు, అలా మనం అప్లోడ్ చేసిన వీడియోస్ ను వేరే వారు చూస్తే Views ని ఆదారం చేసుకొని Youtube ద్వారా మనకు డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది.
- మీరు అనుకోవచ్చు పైన ఏమో ఫేక్ అన్నాడు ఇక్కడ ఇలా చెబుతున్నాడు అని. ఇది 1% అని చెప్పాను చూడండి. అందులో Youtube, Blogger, Websites ద్వారా మనం కష్టపడితే కచ్చితంగ డబ్బు సంపాదించవచ్చు. ఇక్కడ మీ సమయం మరియు టాలెంటే పెట్టుబడిగా ఉపయోగించుకోవాలి.
నా Youtube Channel:- www.youtube.com/anjimvidoes మీరు క్రింద image ని చూడండి.
Image-1
Image-2
- నేను పై ఛానల్ పేజి ను create చేయడం వలన, అందులో కంప్యూటర్ టీచింగ్ కి సంబందించిన వీడియోస్ ను రికార్డ్ చేసి అప్లోడ్ చేసాను.
- అలా చేయడం వలన నేను ఈరోజు డబ్బు సంపాదించగలుగుతున్నాను. నా యొక్క Adsense పేజి ని కూడా చూడండి.
0 Response to "How To Earn Money From Online"